చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రానికి భారీఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ రూపురేఖలు మారిస్తే ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలోని యువతను మత్తు పదార్థాల బానిసలుగా మార్చారని తెదేపా జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీటీ నాయుడు ఆరోపించారు. ఆయన శనివారం నగరంలోని పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే గంజాయి విచ్చలవిడిగా స్మగ్లింగ్ జరుగుతోందని.. ప్రస్తుతం రాష్ట్రంలో అధికార పార్టీ నాయకులేకాక కొందరు పోలీసు సిబ్బంది సైతం రంగప్రవేశం చేశారన్నారు. గంజాయి మత్తులో పలువురు యువకులు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో నారా చంద్రబాబునాయుడుకు మద్దతు తెలిపి రాష్ట్ర భవిష్యత్తుకు బాటలు వేయాలని కోరారు.
source : eenadu.net
Discussion about this post