జనసేన జిల్లా అధ్యక్షులు మరియు అనంతపురము అర్బన్ ఇంచార్జ్ శ్రీ టి.సి.వరుణ్ గారి జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి. సోమవారము స్థానిక రాంనగర్ స్వగృహం వద్ద నాయకుల, కార్యకర్తల కోలాహలం కనిపించింది. శ్రీ టి.సి.వరుణ్ గారికి శుభాకాంక్షలు తెలిపేందుకు జిల్లా నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు తరలివచ్చారు. పుష్పగుచ్చాలు పూల మొక్కలు శాలువాలు కప్పి శుభాకాంక్షలు తెలిపారు. జనసేన నాయకులు తదితరుల ఆధ్వర్యంలో క్రేన్ ద్వారా భారీ గజమాలవేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. శ్రీ టి.సి.వరుణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేయడంతో ఆ ప్రాంగణమంతా మార్మోగింది. అనంతరం భారీ కేక్ కట్ చేసిన శ్రీ టి.సి.వరుణ్ గారు కార్యకర్తలకు పంచి పెట్టారు. కార్యక్రమంలో జిల్లా, నగర కమిటీ సభ్యులు, నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.
Discussion about this post