గోల్లాపురం పారిశ్రామికవాడలోని ఏపీఐఐసీ కి చెందినటువంటి భూమిలో రాత్రిపూట కొంతమంది స్వార్థపరులు జెసిబి ట్రా క్టర్ల ద్వారా అక్రమంగా మట్టిని తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ మట్టిని మన పారిశ్రామిక వాడకు అతి దగ్గరలో ఉన్నటువంటి కర్ణాటక పారిశ్రామికవాడలో చేపడుతున్న రోడ్ల నిర్మాణానికి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.మంగళవారం రాత్రి కొంతమంది అడ్డుకోవడంతో పరారైన దుండగులు. ఈ భూమి ఏపీఐసీఐ లెక్కల ప్రకారం దాదాపు ఒక ఎకరం 80 లక్షల దాకా ఉంటుంది. కానీ ఈ ప్రభుత్వ భూమిలో అక్రమంగా మట్టిని తరలించి పెద్ద పెద్ద గుంతలు గా మార్చారు కొంతమంది స్వార్థపరులు. దీని విలువ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ అక్రమ మట్టి దందా చేసే వారిపై చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
Discussion about this post