• హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
Wednesday, May 14, 2025
  • Login
  • Register
మన నేత - Mana Netha
Mana Netha App
  • హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
No Result
View All Result
  • హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
No Result
View All Result
మన నేత - Mana Netha
No Result
View All Result
Home రాజకీయం

సీఎం రాగానే.. జనం జారుకున్నారు

Naresh Kumar by Naresh Kumar
April 29, 2024
in రాజకీయం
Reading Time: 1min read
0
1
SHARES
100
VIEWS
Share on FacebookShare on WhatsApp

తాడిపత్రిలో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో జగన్‌ ప్రసంగం తేలిపోయింది. ఐదేళ్లుగా బటన్లు నొక్కే కార్యక్రమాల్లో ఏం చెప్పారో.. ఇప్పుడూ అదే ప్రసంగాన్ని ఊదరగొట్టారు. అందులోనూ విషయం లేకపోవడంతో సభకు హాజరైన వైకాపా కార్యకర్తలు అసంతృప్తికి గురయ్యారు. ప్రసంగం పేలవంగా మొదలుపెట్టడంతో సభకు వచ్చిన జనం మొదట్లోనే జారుకున్నారు. పది నిమిషాల్లోనే సగానికి పైగా వెళ్లిపోయారు. ఇటీవల ప్రకటించిన పార్టీ మేనిఫెస్టోను జగన్‌ తన ప్రసంగంలో ప్రస్తావించకపోవడం గమనార్హం. తనను తాను పొగుడుకోవడం.. చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లను తిట్టడానికే పరిమితమయ్యారు. ఐదేళ్లలో ఎన్ని బటన్లు నొక్కారు? ఎంతమంది ఖాతాలో నగదు జమ చేశారో వంటి అంశాలు మినహా కొత్తగా ఏమీ మాట్లడలేదు. ఎక్కడా అనంత జిల్లా పేరు కూడా ప్రస్తావించకపోవడం గమనార్హం.

తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి గురించి సీఎం మాట్లాడుతూ… మాట కొంచెం కఠినం కానీ.. మనిషి చాలా మంచివాడు అంటూ పొగిడారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఈ ఐదేళ్లలో వ్యవహరించిన తీరు తాడిపత్రితో పాటు జిల్లా మొత్తానికి తెలుసు. మళ్లీ ఫ్యాక్షన్‌ మొదలుపెడతానని బహిరంగంగా చెప్పిన ప్రజాప్రతినిధిని మంచివాడంటూ ఎలా చెబుతారని స్థానికులు నిలదీస్తున్నారు. గంటన్నర ఆలస్యంగా తాడిపత్రి సభాప్రాంగణానికి చేరుకున్న జగన్‌.. హడావుడిగా ప్రసంగాన్ని ముగించారు. జనం పెద్దగా రాకపోవడంతో.. కప్పిపుచ్చేందుకు వైకాపా నాయకులు నానాతంటాలు పడ్డారు. సభకు వచ్చిన వారికి మందు, బిర్యానీతో పాటు రూ.500 డబ్బులు పంపిణీ చేశారు.

ఇంకాచదవండి

కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్‌కళ్యాణ్‌

May 10, 2024

గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు

May 10, 2024

సీఎం జగన్‌ పర్యటనతో తాడిపత్రి వాసులకు కష్టాలు తప్పలేదు. పుట్లూరు రోడ్డు నుంచి పోలీస్‌స్టేషన్‌ సభా ప్రాంగణం వరకు సుమారుగా వంద చెట్ల కొమ్మలు తొలగించారు. కాన్వాయ్‌కు అడ్డుగా ఉన్నాయని ఏకంగా విద్యుత్తు తీగలను తొలగించారు. టైలర్స్‌కాలనీ, కృష్ణాపురం రోడ్డు, రెడ్డివారిపాలెం పరిధిలో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. వేసవి తాపానికి తట్టుకోలేక పట్టణవాసులు అవస్థలు పడ్డారు. పోలీసుల ఆంక్షలతోనూ తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఆర్టీసీ బస్సులను బైపాస్‌ నుంచి మళ్లించడంతో నాలుగు కిలోమీటర్ల దూరంలోనే ప్రయాణికులను దింపేశారు. యల్లనూరు రోడ్డు నుంచి అశోక్‌పిల్లర్‌ వరకు రెండువైపులా బారికేడ్లు ఏర్పాటు చేయడంతో సామాన్యులు ఇబ్బంది పడ్డారు. పుట్లూరు రోడ్డు, సభా ప్రాంగణంలో దుకాణాలను బలవంతంగా మూసివేయించారు. ఆఖరికి మందుల దుకాణాలనూ బంద్‌ చేయించారు. ఇదిలా ఉండగా ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినా పోలీసుల్లో మాత్రం మార్పు రావడం లేదు. సుమారు 2 వేల మంది పోలీసుల్ని బందోబస్తుకు కేటాయించారు. అనంతపురం రేంజ్‌ డీఐజీ అమ్మిరెడ్డి, ఎస్పీ అమిత్‌ బర్దార్‌ స్వయంగా బందోబస్తు పర్యవేక్షించడం గమనార్హం.

source : eenadu.net

Tags: 2024 election campaigningcm ys jaganTadipatri political news

ఇంకాచదవండి

రాజకీయం

కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్‌కళ్యాణ్‌

May 10, 2024
రాజకీయం

గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు

May 10, 2024
రాజకీయం

వేరే పార్టీకి ఓటేస్తే పథకాలు రావంటూ బెదిరింపు

May 10, 2024
రాజకీయం

ఓటింగ్‌ శాతాన్ని పెంచాలి

May 10, 2024
రాజకీయం

ఓ మహిళా ఏది కావాలో ఎంచుకో.. వరమా? వంచనా?

May 10, 2024
రాజకీయం

ఈసీ ఉత్తర్వులపై ఒకరోజు స్టే

May 10, 2024
Next Post

తెదేపా సూపర్‌ సిక్స్‌ ముందు.. వైకాపా గ్రాఫ్‌ పడిపోయింది: కేశవ్‌

Discussion about this post

  • పాల్ అనుచరులు చేపట్టిన ప్రయాణం
  • పేదల ప్రాణాలతో చెలగాటమాడొద్దు
  • తప్పుడు పత్రాలు సృష్టించి భూమిని కాజేస్తున్న భూకబ్జాదారులు
  • వేపరాల
  • పార్థసారథికి పచ్చ పోటు!

  • మత్స్యకారుల ఆర్థిక ప్రగతికి ప్రాధాన్యత
  • ధర్మవరంలో హింస..
  • నర్సింపల్లి
  • 17న పల్నాడులో మోడీ టూర్..!
  • రొద్దం

మన నేత - Mana Netha

© 2024 మన నేత

  • Privacy Policy
  • Terms and Conditions
  • About Us
  • సంప్రదించండి

No Result
View All Result
  • రాజకీయం
  • క్రైమ్
  • క్రీడలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • టాప్ వీడియోస్
  • సినిమా
  • బిజినెస్

© 2024 మన నేత

Welcome Back!

OR

Login to your account below

Forgotten Password? Sign Up

Create New Account!

OR

Fill the forms below to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In