అనంతపురం జిల్లా డి.హీరేహాళ్ మండలం నాగలాపురం, తిమ్మలాపురం, సోమలాపురం గ్రామాల్లో మంగళవారం రాయదుర్గం నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి తరఫున ఆయన తనయుడు విశ్వనాథ్‌రెడ్డి, నాయకులు ఇంటింటా ప్రచారం నిర్వహించి కరపత్రాలు అందించారు. నిబంధనలను పాటించకుండా గ్రామ వాలంటీర్లు చైత్ర, అమరేష్, బేబీ పాల్గొన్నారు. బెళుగుప్ప మండలం కాలువపల్లిలో మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి తనయుడు ప్రణయ్‌రెడ్డి, నాయకులు వైకాపా విజయ సంకల్ప యాత్ర నిర్వహించారు. అదే గ్రామానికి చెందిన ఉపాధి పథకం క్షేత్ర సహాయకుడు పెద్దన్న, ఇతర గ్రామాలకు చెందిన పలువురు క్షేత్రస్థాయి సిబ్బంది పాల్గొన్నారు.
source : eenadu.net










Discussion about this post