వైఎస్సార్‌సీపీకి ఐటీ వింగ్ గుండెలాంటిదని తుడా చైర్మన్, వై ఎస్సార్‌సీపీ చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి తెలిపా రు. వైఎస్సార్‌సీపీ ఐటీ ఆర్మీ ఆధ్వర్యంలో నూతనంగా రూపొందించిన పోస్టర్లను శనివారం తుమ్మలగుంటలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మోహిత్‌రె డ్డి మాట్లాడుతూ రాజకీయ పార్టీలకు ఐటీ విభాగం వెన్నెముకలాంటిదన్నారు. దే శంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగ సంక్షేమ పథకాలను గడప గడపకూ చేర్చడంలో వలంటీర్ వ్యవస్థతో పాటు ఐటీ విభాగం కూడా కీలకంగా ఉందన్నారు. చేసిన మంచిని పది మందికీ చెప్పే గురుతర బాధ్యతను భుజాన వేసుకుని వంద శాతం సక్సెస్ అయిన ఐటీ విభాగానికి అభినందనలు తెలిపారు. అనంతరం ఐటీ విభాగం పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో తిరుపతి జిల్లా ఐటీ విభాగ ప్రెసిడెంట్ రాచపల్లి మదన్‌మోహన్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ దూది సుధీర్ (చింటు), సెక్రటరీ రెడ్డిచెర్ల నరేష్ బాబు, బెంగళూరు ఐటీ విభాగ సభ్యులు పాల్గొన్నారు.
source : sakshi.com










Discussion about this post