గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ స్మారక స్తూపాన్ని వైకాపా చిత్తూరు జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ భరత్ ఆవిష్కరించారు. మూడు రాష్ట్రాల పోలీసులను ముప్పుతిప్పలు పెట్టి అనేక మందిని చంపిన వీరప్పన్‌కు ఎమ్మెల్సీ అనుకూలమంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతోంది. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం అబకలదొడ్డి పంచాయతీ కాకర్లవంకలోని కొందరు వీరప్పన్‌కు గుర్తుగా స్తూపాన్ని నిర్మించారు. వీరప్పన్ చిత్రపటంతోపాటు జెండా ఏర్పాటుచేశారు. ఆ గ్రామంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ వాటిని ఆవిష్కరించారు. శాంతిపురం జడ్పీటీసీ సభ్యుడు శ్రీనివాసులు, రెస్కో వైస్‌ఛైర్మన్ కోదండరెడ్డితో కలిసి ఎమ్మెల్సీ నవ్వుతూ ఫొటోలకు ఫోజులిచ్చారు. కుప్పం శాసనసభ పార్టీ అభ్యర్థిగా భరత్‌ను సీఎం జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
source : eenadu.net










Discussion about this post