రేషన్ బియ్యం ఇవ్వాలంటే ఏడాదికి రూ.4,600 కోట్లు అవసరమని సీఎం జగన్ మంగళవారం శాసనసభలో చెప్పారు. కందిపప్పు, ఉప్పు, నూనెలు, ఇతరత్రా నిత్యావసరాలూ ఇవ్వాలంటే ఏడాదికి కనీసం రూ.6వేల కోట్లైనా కావాలి. కానీ, వైకాపా ప్రభుత్వం ఇందుకోసం అయిదేళ్లలో పౌరసరఫరాల సంస్థకు ఇచ్చిందెంతో తెలుసా… కేవలం రూ.1,957 కోట్లు. అంటే.. ఏడాదికి రూ.400 కోట్ల లోపే. మరి.. మిగతా సొమ్ము ఎలా అంటే.. అప్పు తెచ్చి సర్దుకోవాలని పౌరసరఫరాల సంస్థపైకి నెట్టేస్తున్నారు. అలా ఈ సంస్థనూ రూ.35 వేల కోట్లకు పైగా అప్పుల్లో ముంచిన ఘన సీఎం జగన్‌కే దక్కుతుంది.
అప్పులు దొరక్క.. పౌరసరఫరాల సంస్థ కూడా అరకొర పంపిణీతో సరిపెడుతోంది. కందిపప్పు పంపిణీ కూడా కొన్ని నెలలు ఇస్తే, మరికొన్ని నెలలు నిలిపి వేస్తోంది. దాన్నీ 2 కిలోల నుంచి కిలోకు తగ్గించింది. గోధుమ పిండి, చిరుధాన్యాల పంపిణీని ఇటీవలే ప్రారంభించినా.. అదీ కొన్ని ప్రాంతాలకే పరిమితం చేసింది. ఇతర నిత్యావసరాల ఊసే లేదు.
2024-25 బడ్జెట్లో ఆహార పౌరసరఫరాల శాఖకు రూ.3,829 కోట్లు ఇవ్వాలని కోరారు. తొలి త్రైమాసికానికి రూ.1,276 కోట్లు అవసరమని పేర్కొన్నారు. కానీ బడ్జెట్ కేటాయింపులు చూస్తే రూ.204 కోట్లతో సరిపెట్టారు.
source : eenadu.net










Discussion about this post