• హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
Tuesday, May 13, 2025
  • Login
  • Register
మన నేత - Mana Netha
Mana Netha App
  • హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
No Result
View All Result
  • హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
No Result
View All Result
మన నేత - Mana Netha
No Result
View All Result
Home రాజకీయం

రాయలసీమ ద్రోహిని అడ్డుకోండి

Naresh Kumar by Naresh Kumar
March 28, 2024
in రాజకీయం
Reading Time: 1min read
0
1
SHARES
100
VIEWS
Share on FacebookShare on WhatsApp

యాత్రపేరుతో పరదాల చాటు నుంచి ముసుగువీరుడు బయటకొచ్చారని… ‘జగన్‌ నువ్వు రాయలసీమ ద్రోహివి.. ఇక్కడికి రావడానికి వీల్లేదు’ అని జనం గట్టిగా చెప్పాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. ‘సీఎం బస్సు యాత్రకు ఖాళీ రోడ్లు, ఇళ్లే స్వాగతం పలకాలి. బాబాయిపై గొడ్డలివేటు వేసిన అవినాశ్‌రెడ్డీ అదే బస్సులో ఉన్నారు. ఆయనకు జగన్‌ ఎంపీ టికెట్‌ ఇచ్చి ప్రజల్ని వెక్కించారు. 2014-19లో నేను సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులకు రూ.65 వేల కోట్లకు పైగా ఖర్చుపెట్టాం. ప్రత్యేకించి రాయలసీమలోనే రూ.12 వేల కోట్లు వెచ్చించాం. ఒక్క హంద్రీ-నీవా ప్రాజెక్టుకే రూ.4,200 కోట్లు ఇచ్చాం. తర్వాత ఐదేళ్లలో కేవలం రూ.2,165 కోట్లనే వైకాపా ప్రభుత్వం ఖర్చుపెట్టింది. 102 ప్రాజెక్టుల్ని రద్దు చేసింది. అవినీతిలో పుట్టిన సాక్షి పత్రికకు ప్రకటనల రూపంలో వందల కోట్ల రూపాయల్ని దోచిపెట్టారు’ అని చంద్రబాబు మండిపడ్డారు. డబ్బు వసూలుకు, దౌర్జన్యాలు చేసేందుకు నియమించుకున్న సలహాదారులకు సీమ సాగునీటి ప్రాజెక్టులపై పెట్టినదాని కన్నా ఎక్కువ మొత్తం ఇచ్చారని, అందుకే జగన్‌ను అడుగడుగునా నిలదీయాలని పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లా పలమనేరు, తిరుపతి జిల్లా పుత్తూరులో చంద్రబాబు బుధవారం ‘ప్రజాగళం’ సభలు నిర్వహించి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.

‘భాజపాతో కలిసిన మమ్మల్ని జగన్‌ విమర్శిస్తున్నారు. పొత్తు మా స్వార్థం కోసం కాదు. దివాలా తీసిన రాష్ట్రాన్ని కాపాడుకోవడానికే ఎన్డీయేతో జట్టుకట్టాం. ఈ సీఎం రాష్ట్ర అప్పుల భారాన్ని రూ.12 లక్షల కోట్లకు పెంచారు. సంక్షేమ పథకాలు ఇవ్వలేని స్థితికి వచ్చారు. అభివృద్ధి నిలిచిపోయింది. రాబోయే రోజుల్లో రాష్ట్రం సజావుగా ముందుకు సాగాలంటే కేంద్రం సహకారం అవసరం. అందుకే మూడు పార్టీలూ కలిశాయి’ అని చంద్రబాబు చెప్పారు. ‘ప్రజల్లో ఎక్కడ చూసినా ఆవేదన కనిపిస్తోంది. ఎన్నికల్లో అది అగ్నిగా మారి అరాచక వైకాపాను భస్మం చేయాలి. జగన్‌రెడ్డీ సిద్ధంగా ఉండు. నిన్ను నీ ప్రభుత్వాన్ని, కుర్చీని బంగాళాఖాతంలో కలిపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మే 13 తర్వాత మీ అహంకారం కూలిపోతుంది’ అని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ‘కలలకు రెక్కలు.. పథకం కింద విద్యార్థులకు వడ్డీ లేని రుణాలు ఇస్తాం. బీసీలకు 50 ఏళ్లకే పింఛన్‌ ఇచ్చే బాధ్యత నాది. కూటమి అధికారంలోకి వస్తే విద్యుత్తు ఛార్జీలు పెరగవు. అన్న క్యాంటీన్లు మళ్లీ వస్తాయి. రూ.4 వేల పింఛన్‌ను మొదటి తేదీనే మీ ఇంటికి చేరుస్తాం. చేనేతల కోసం ప్రత్యేక విధానం తెస్తాం. ప్రభుత్వ ఉద్యోగులకు అండగా ఉంటాం’ అని చంద్రబాబు హామీ ఇచ్చారు.

ఇంకాచదవండి

కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్‌కళ్యాణ్‌

May 10, 2024

గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు

May 10, 2024

‘పేదలకు అన్నంపెట్టే అన్నక్యాంటీన్‌లను రద్దు చేసిన వ్యక్తి పేదవారా? బీద పిల్లల కోసం విదేశీ విద్య ఉన్నత పథకాన్ని తీసుకువస్తే దానిని అటకెక్కించిన వారు పేదవారా? బడుగుల కోసం మేం నిర్మించిన లక్షల ఇళ్లను నిరుపయోగంగా ఉంచిన వ్యక్తి పేదవారా?’ అని చంద్రబాబు విమర్శించారు. ‘దేశంలోని సీఎంలు అందరికీ ఎంత ఆస్తి ఉందో అంతకంటే ఎక్కువ సంపాదించారు ఈ ముఖ్యమంత్రి. పేదలను మరింత నిరుపేదలుగా మారుస్తున్న పెత్తందారు జగన్‌’ అని దుయ్యబట్టారు.

source : eenadu.net

Tags: 2024 election campaigningAP EX CM Chandrababu naidutdp

ఇంకాచదవండి

రాజకీయం

కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్‌కళ్యాణ్‌

May 10, 2024
రాజకీయం

గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు

May 10, 2024
రాజకీయం

వేరే పార్టీకి ఓటేస్తే పథకాలు రావంటూ బెదిరింపు

May 10, 2024
రాజకీయం

ఓటింగ్‌ శాతాన్ని పెంచాలి

May 10, 2024
రాజకీయం

ఓ మహిళా ఏది కావాలో ఎంచుకో.. వరమా? వంచనా?

May 10, 2024
రాజకీయం

ఈసీ ఉత్తర్వులపై ఒకరోజు స్టే

May 10, 2024
Next Post

ఆరంభమే ఫ్లాప్‌

Discussion about this post

  • పాల్ అనుచరులు చేపట్టిన ప్రయాణం
  • పేదల ప్రాణాలతో చెలగాటమాడొద్దు
  • తప్పుడు పత్రాలు సృష్టించి భూమిని కాజేస్తున్న భూకబ్జాదారులు
  • వేపరాల
  • పార్థసారథికి పచ్చ పోటు!

  • మత్స్యకారుల ఆర్థిక ప్రగతికి ప్రాధాన్యత
  • ధర్మవరంలో హింస..
  • నర్సింపల్లి
  • 17న పల్నాడులో మోడీ టూర్..!
  • రొద్దం

మన నేత - Mana Netha

© 2024 మన నేత

  • Privacy Policy
  • Terms and Conditions
  • About Us
  • సంప్రదించండి

No Result
View All Result
  • రాజకీయం
  • క్రైమ్
  • క్రీడలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • టాప్ వీడియోస్
  • సినిమా
  • బిజినెస్

© 2024 మన నేత

Welcome Back!

OR

Login to your account below

Forgotten Password? Sign Up

Create New Account!

OR

Fill the forms below to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In