• హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
Wednesday, May 14, 2025
  • Login
  • Register
మన నేత - Mana Netha
Mana Netha App
  • హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
No Result
View All Result
  • హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
No Result
View All Result
మన నేత - Mana Netha
No Result
View All Result
Home రాజకీయం

ప్రాణాలకు తెగించి నయవంచకుడితో తలపడుతున్నా!

Naresh Kumar by Naresh Kumar
May 2, 2024
in రాజకీయం
Reading Time: 1min read
0
1
SHARES
100
VIEWS
Share on FacebookShare on WhatsApp

‘సగటు మనిషి కోసం ప్రాణాలకు తెగించి.. ఒక నయవంచకుడు, గూండా, ఒక దోపిడీదారుడిపై పోటీ చేయడానికి మీ గళమై.. గుండె చప్పుడై.. ఇక్కడ ఉన్నా’ అంటూ సీఎం జగన్‌ను ఉద్దేశించి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విరుచుకుపడ్డారు. ‘నాన్న లేని బిడ్డను ఒకే ఒక్క ఛాన్స్‌ ఇవ్వండి’ అని జగన్‌ అడిగితే అంతా ఇచ్చారు. ఆ ఒక్క ఛాన్స్‌ అయిపోయింది.. ఇక చాలు. సంపూర్ణంగా రాష్ట్రాన్ని ఎలా దోచేశారో చూశారు.. ఈసారి మీకు మీరు ఛాన్స్‌ ఇచ్చుకోండి.. మీ భవిష్యత్తును మీరు నిర్ణయించుకోవడానికి ఒక ఛాన్స్‌ తీసుకోండి’ అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం, పెందుర్తి, డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మండపేటల్లో బుధవారం నిర్వహించిన వారాహి విజయభేరి సభల్లో ఆయన ప్రసంగించారు. ‘మేము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో గంజాయి మాఫియాపై ఉక్కుపాదం మోపుతాం. ఆడబిడ్డల భద్రతకు పెద్దపీట వేస్తాం. వైకాపా వారికి ఒక్కఛాన్స్‌ ఇస్తే రూ.60 ఉన్న మద్యంను రూ.200కు పెంచి జలగలా పీల్చేశారు. రూ.41 వేల కోట్లకు ఇసుకను అమ్మేశారు. కనిపించే కొండ ఎవరిది? గాలి.. నీరు.. నిప్పు..నేలా మనందరివీ.. ఒక్క జగన్‌వో, వైకాపా ఎమ్మెల్యేలవో కాదు’ అని పవన్‌ స్పష్టం చేశారు.

‘మీ ఆస్తులను దోచేయడానికి జగన్‌ ఒక చట్టం తెస్తున్నారు. అది ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ కాదు.. ‘జగన్‌ ల్యాండ్‌ గ్రాబింగ్‌ యాక్ట్‌’. మరో దఫా వైకాపాకు ఓటేస్తే మీ ఆస్తులకు రక్షణ ఉండదు. ఆస్తి పత్రాలపై జగన్‌ ఫొటో ఎందుకు? ఒరిజినల్‌ స్టాంపు పేపర్లు, పట్టాదారు పాసు పుస్తకాలు మన దగ్గర ఉండాలి. ఈ చట్టం వస్తే జిరాక్సులే ఉంటాయి. ఎవరైనా కబ్జా చేస్తే రెవెన్యూ అధికారి దగ్గరకు వెళ్లాలట. వాళ్లంతా ఒక్కటైతే పరిస్థితి ఏంటి? అక్కడ అన్యాయం జరిగితే ఎంతమంది కోర్టుకు వెళ్లగలరు. వైకాపాకు ఓటేస్తే మీ ఆస్తులు గాలిలో దీపాలే. మీ ఆస్తి పత్రాల ఒరిజినల్స్‌ అన్నీ హైదరాబాద్‌లోని జగన్‌ ఇంట్లో ఉంటాయి. కూటమి ప్రభుత్వం రాగానే ఈ చట్టాన్ని రద్దు చేస్తాం. ఈ చట్టం కేంద్రం తెచ్చిందని వైకాపా నాయకులు అంటున్నారు. కేంద్రం ముసాయిదా మాత్రమే పంపుతుంది. దానిపై అసెంబ్లీలో చర్చ జరగాలి కానీ చర్చించరు. తెదేపా వారిని మాట్లాడనీయరు. పట్టాదారు పాసు పుస్తకంపై రాజముద్ర ఉండాలి, మీ ఫొటో కాదు జగన్‌.. పాస్‌పోర్ట్‌పై ప్రధాని ఫొటో లేదు కదా’ అని వైకాపా సర్కారుపై పవన్‌ విమర్శలు గుప్పించారు.

ఇంకాచదవండి

కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్‌కళ్యాణ్‌

May 10, 2024

గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు

May 10, 2024

‘యువత మార్పు కోరుకుంటే తప్ప ఏదీ జరగదు. రాష్ట్రంలో దాదాపు 23 లక్షల మంది యువత గంజాయికి బానిసైంది. వైకాపా నాయకులు రాష్ట్రాన్ని గంజాయి రవాణాలో తొలి స్థానంలో పెట్టారు. పోర్టులో రూ.వేల కోట్ల విలువైన డ్రగ్స్‌ దొరికాయి. ఉపాధి అవకాశాలు కల్పించలేదు. రూ.450 కోట్ల భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి, ఉద్యోగుల తాలూకా గ్రాట్యుటీ ఫండ్‌ దోచేశారు. ఇన్ని చేసి.. మళ్లీ ఇప్పుడు ఓట్ల కోసం వస్తే.. ‘గెట్‌ లాస్ట్‌ జగన్‌’ అనండి. చెత్త పన్నేసిన ప్రభుత్వాన్ని చెత్తలో పడేద్దాం’ అంటూ పవన్‌ పిలుపునిచ్చారు. ‘పూడిమడకలో ఫిషింగ్‌ హార్బర్‌ తీసుకురావడానికి కృషి చేస్తాం. అచ్యుతాపురం సెజ్‌ కోసం 26 గ్రామాల నుంచి 4 వేల ఎకరాలిచ్చిన రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. వారికి అండగా నిలుస్తాం. భవన నిర్మాణ కార్మికులకు మేలు చేసేందుకు ఉచిత ఇసుక విధానాన్ని అమల్లోకి తెస్తాం. సహజ వనరులు జగన్‌రెడ్డి, పెద్దిరెడ్డి, మిథున్‌రెడ్డి, సజ్జల, వైవీ సుబ్బారెడ్డిల సొంతం కాదు. గుత్తాధిపత్యంతో పెత్తనం చేస్తానంటే తొక్కేస్తాం. జగన్‌ కులాలను వాడుకొని ఎదుగుతున్నారు. మనం వాటిని దాటకపోతే రాష్ట్రం నాశనమైపోతుంది. రైతుల సమస్యలు పరిష్కారమవ్వాలంటే వైకాపాకు పొలిటికల్‌ హాలీడే ప్రకటించాలి’ అని ధ్వజమెత్తారు. ‘మండపేటకు వెళితే రాంచరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, మహేష్‌, ప్రభాస్‌, చిరంజీవి ఫొటోలు పెట్టారు. అల్లు అర్జున్‌ ఫొటో పెట్టి తగ్గేదేలే అంటూ యువత ఉత్సాహంగా కేరింతలు కొట్టారు. యువత ఎన్నికల సమయంలో వైకాపాకు ‘తగ్గేదేలే’ అని చెప్పి గద్దె దించుతామనండి’ అంటూ పవన్‌ పిలుపునిచ్చారు. అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని మ్యానిఫెస్టో ప్రకటించామని వివరించారు.

source : eenadu.net

Tags: 2024 election campaigningjanasena chief pawan kalyan

ఇంకాచదవండి

రాజకీయం

కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్‌కళ్యాణ్‌

May 10, 2024
రాజకీయం

గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు

May 10, 2024
రాజకీయం

వేరే పార్టీకి ఓటేస్తే పథకాలు రావంటూ బెదిరింపు

May 10, 2024
రాజకీయం

ఓటింగ్‌ శాతాన్ని పెంచాలి

May 10, 2024
రాజకీయం

ఓ మహిళా ఏది కావాలో ఎంచుకో.. వరమా? వంచనా?

May 10, 2024
రాజకీయం

ఈసీ ఉత్తర్వులపై ఒకరోజు స్టే

May 10, 2024
Next Post

భూ హక్కు చట్టం రద్దుపై రెండో సంతకం

Discussion about this post

  • పాల్ అనుచరులు చేపట్టిన ప్రయాణం
  • పేదల ప్రాణాలతో చెలగాటమాడొద్దు
  • తప్పుడు పత్రాలు సృష్టించి భూమిని కాజేస్తున్న భూకబ్జాదారులు
  • వేపరాల
  • పార్థసారథికి పచ్చ పోటు!

  • మత్స్యకారుల ఆర్థిక ప్రగతికి ప్రాధాన్యత
  • ధర్మవరంలో హింస..
  • నర్సింపల్లి
  • 17న పల్నాడులో మోడీ టూర్..!
  • రొద్దం

మన నేత - Mana Netha

© 2024 మన నేత

  • Privacy Policy
  • Terms and Conditions
  • About Us
  • సంప్రదించండి

No Result
View All Result
  • రాజకీయం
  • క్రైమ్
  • క్రీడలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • టాప్ వీడియోస్
  • సినిమా
  • బిజినెస్

© 2024 మన నేత

Welcome Back!

OR

Login to your account below

Forgotten Password? Sign Up

Create New Account!

OR

Fill the forms below to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In