మేమంతా సిద్ధం బస్సు యాత్రకు కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో అపూర్వ ఆదరణ లభించింది. సీఎం జగన్ రాక కోసం ఉదయం నుంచి రాత్రి వరకు పల్లెలు ఎదురు చూశాయి. మూడో రోజు బస్సు యాత్ర కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు, పత్తికొండ నియోజకవర్గాల్లో దాదాపు 108 కిలోమీటర్ల మేర సాగింది.
శుక్రవారం ఉదయం 10.35 గంటలకు కోడుమూరు నియోజకవర్గం గూడూరు మండలం పెంచికలపాడులో రాత్రి బస చేసిన శిబిరం నుంచి ప్రారంభమైన బస్సుయాత్ర పత్తికొండ మండలం రాతన వరకు కొనసాగింది. మంత్రాలయం, ఆదోని, ఆలూరు, పత్తికొండ నియోజకవర్గాల్లో బస్సు యాత్ర పూర్తిగా రాత్రి వేళ సాగినా ప్రజలు వైఎస్ జగన్ రాక కోసం నిరీక్షించారు. తమ అభిమాన నేతను చూసేందుకు పెద్దల నుంచిపిల్లల వరకు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
source : sakshi.com










Discussion about this post