ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి మరో రెండు, మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. అభ్యర్థుల ఎంపిక, ప్రచారంపై ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. ప్రధాన పార్టీల అధినేతలు క్షేత్రస్థాయిలో ప్రజలను కలుస్తున్నారు.జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆదివారం ( ఈ రోజు) విశాఖపట్టణం వెళతారు. హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక విమానంలో విశాఖ వస్తారు. మూడు రోజులుపాటు అక్కడే ఉంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, తూర్పు గోదావరి జిల్లా నాయకులతో వరసగా సమావేశం అవుతారు. అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయ కర్తలతో విడివిడిగా సమావేశం అవుతారు. తెలుగుదేశం పార్టీతో పొత్తుల నేపథ్యంలో త్వరలో పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. తర్వాత అభ్యర్థులను ప్రకటిస్తారని తెలుస్తోంది.
source : andhrajyothi.com
	    	
                                









                                    
Discussion about this post