సంక్షేమ, రైతు రాజ్యాన్ని చంద్రబాబు కూటమి అంతం చేయాలని చూస్తోందని మండిపడ్డారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. కూటమి కుట్రలను ప్రజలు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. సాధ్యంకానీ హామీలతో బాబు మళ్లీ వస్తున్నాడని.. ఆయనకు ఓటేస్తే పథకాలన్నీ కూడా మునిగిపోతాయని అన్నారు. మీ బిడ్డ వైఎస్ జగన్‌ది పేదలపక్షమని.. తనకు ఓటేస్తే జరుగుతున్న మంచి కొనసాగుతుందని పేర్కొన్నారు.
సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 16వ రోజు మంగళవారం ఉమ్మడి పపశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగుతోంది. భీమవరంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్‌లపై నిప్పులు చెరిగారు. మోసాలు పొత్తులను నమ్ముకొని బాబు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఒక్క జగన్‌కు వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఒక్కటయ్యాయన్నారు. వీళ్లందరూ నాపై బాణాలు ఎక్కుపెట్టారు. వారి బాణాలు తగిలేవి.. జగన్‌కా? సంక్షేమ పథకాలకా? అని సభకు హాజరైన అవేష జనవాహినిని ఉద్ధేశించి వ్యాఖ్యానించారు.
source : sakshi.com










Discussion about this post