రాష్ట్రంలోని అన్నివర్గాల సంక్షేమం తెదేపా పాలనతోనే సాధ్యంమవుతుందని పీఏసీ ఛైర్మన్, ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. మండలంలోని వై.రాంపురంలో బుధవారం బాబు ష్యూరిటీ-భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం జరిగింది. స్థానిక తెదేపా శ్రేణులతో కలిసి ఆయన ఇంటింటా తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పించారు. వైకాపా ప్రభుత్వం సంక్షేమం పేరుతో ప్రజలను మోసం చేస్తోందని, నిబంధనల పేరుతో పథకాలను కుదించిందన్నారు. ప్రశ్నించిన వారిని ఇబ్బందులకు గురి చేస్తోందని చెప్పారు. తెదేపా అధికారంలోకి వస్తే ఎలాంటి నిబంధనలను అడ్డుపెట్టకుండా, అన్ని పథకాలను సమర్థంగా అమలు చేయనుందని తెలిపారు. ముందుగా గ్రామస్థులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. హారతులు పట్టి పూలు చల్లుతూ గ్రామంలోకి ఆహ్వానించారు. ఎంపీటీసీ సభ్యులు మోపిడి శ్రీనివాసులు, దేవరాజు, తెదేపా నాయకులు రాజాగౌడ్, సంజీవరాయుడు, ఎర్రిస్వామి, వెంకటనారాయణ, యల్లప్ప, శివశంకర్, చంద్ర, భీమశేఖర్ పాల్గొన్నారు.
source : eenadu.net










Discussion about this post