శ్రీసత్యసాయి జిల్లాలో కదిరి, పుట్టపర్తి నియోజకవర్గాలకు తెదేపా తరఫున పోటీ చేసే అభ్యర్థుల పేర్లను అధిష్ఠానం ప్రకటించడంతో ఆయా ప్రాంతాల్లో గురువారం సందడి నెలకొంది. పుట్టపర్తికి మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కోడలు పల్లె సింధూరరెడ్డికి, కదిరికి మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ సతీమణి యశోదదేవికి టికెట్లు కేటాయించడంతో రెండు నియోజకవర్గాల్లో నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున బాణ సంచా కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. మిఠాయిలు పంచి ఆనందం వ్యక్తం చేశారు.
source : eenadu.net
 
	    	 
                                









 
                                    
Discussion about this post