మండలంలోని పరమేశ్వరమంగళం వైకాపా ఎంపీటీసీ సభ్యురాలు శ్రీజ, ఆమె భర్త బాలాజీనాయుడు విజయవాడలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఆదివారం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, నాయకుడు పోతుగుంట విజయబాబు సమక్షంలో తెదేపాలో చేరారు. ఆమె వైకాపా ఎంపీటీసీ పదవికి, వైకాపాకు రాజీనామా చేసినట్లు తెలియ జేశారు. ఆమె మాట్లాడుతూ నగరిలో తెదేపా గెలుపునకు కృషి చేస్తామని, వైకాపా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందన్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేయాల్సిన ప్రభుత్వం వారిపై ఛార్జీల భారం మోపడంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యదర్శి రవినాయుడు, రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి సుమన్‌నాయుడు, ప్రవాస భారతీయుడు శంకర్‌నాయుడు, ప్రవీణ్, శంకర్ ఉన్నారు.
source : eenadu.net










Discussion about this post