జగన్మాయతో రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని ఉరవకొండ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. మండలంలోని కొత్తకోట, చిన్నప్యాపిలి, పెద్దప్యాపిలి, ప్యాపిలితండా, కడమలకుంట, రాగులపాడు, పందికుంట. వెంకటాంపల్లి పెద్దతండా, ఎన్‌ఎన్‌పీతండా, తట్రకల్లు, గంజికంట గ్రామాలలో ఆదివారం రోడ్‌షో నిర్వహించారు. ఆయా గ్రామాల్లో ప్రజలు, మహిళలు గజమాలలు, హారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ వైకాపా ప్రభుత్వానికి ఉన్న వాటిని కూల్చడం తప్ప కొత్తవి నిర్మించడం చేతకాదని విమర్శించారు. తెదేపా హయాంలో నియోజకవర్గ వ్యాప్తంగా 11 చెరువులకు నీరందించానన్నారు. వైకాపా ప్రభుత్వంలో గ్రామాల్లో కనీసం మురుగు కాలువ కూడా నిర్మించలేకపోయారని ఎద్దేవా చేశారు. తెదేపా ప్రభుత్వం అధికారంలోకి వస్తే అమలు చేయబోయే పథకాల గురించి ప్రజలకు వివరించారు. పార్టీకి అండగా నిలవాలని కోరారు.
source : eenadu.net










Discussion about this post