పొత్తులో భాగంగా 24 సీట్లు మాత్రమే తీసుకుని నమ్మినవారిని నట్టేట ముంచాడనే విమర్శ.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై బలంగా వినిపిస్తోందిప్పుడు. ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి ఆయన తీరని ద్రోహం చేశారంటూ పలువురు మండిపడుతున్నారు. అయితే మొదటి నుంచి సీట్ల విషయంలో తగ్గొద్దంటూ లేఖల ద్వారా సలహాలు ఇస్తూ వస్తున్న మాజీ పార్లమెంటేరియన్, కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు హరిరామ జోగయ్య.. ఈసారి ఘాటు లేఖాస్త్రం సంధించారు.
టీడీపీ-జనసేన పొత్తు.. సీట్ల పంపకం.. చూశాక బడుగులకు రాజ్యాధికారం పక్కదారి పడుతుందేమోనని అనిపిస్తోందని లేఖలో అనుమానం వ్యక్తం చేశారు హరిరామ జోగయ్య. అసలు బడుగు బలహీన వర్గాల భవిష్యత్ ఏంటో తేల్చాలని, ఇందుకు తాడేపల్లి గూడెంలో జరగబోయే మీటింగ్‌లో ఇరు పార్టీల నేతలు స్పష్టత ఇవ్వాలని జోగయ్య డిమాండ్ చేశారు. అంతేకాదు..కూటమిలో పవన్ స్థానం పక్కదారి పడుతోందని.. పవన్, చంద్రబాబుల పాత్ర ఏంటో స్పష్టంగా తేలాల్సిన అవసరం ఉందని జోగయ్య అన్నారు. అంతేకాదు.. అధికారంలో సగం వాటా జనసేకు దక్కాలని.. గౌరవప్రదమైన హోదాలో పవన్ పదవి దక్కించుకోవాలని, బడుగు బలహీనవర్గాల సర్వాధికారాలు పవన్‌కు దక్కాలని కాపు నేత ఆకాంక్షించారు.
బడుగు బలహీనవర్గాలు కోరుకునే రాజ్యాధికారం.. కూటమిలో పవన్ హోదా ఏంటో చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్న హరిరామ జోగయ్య.. చంద్రబాబు గనుకసీ అంశంలో స్పష్టత ఇవ్వకుంటే 29న తన నిర్ణయం ప్రకటిస్తానని కూటమికి అల్టిమేటం జారీ చేశారాయన.
source : sakshi.com










Discussion about this post