కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని బలోపేతం చేయాలని భాజపా జిల్లా అధ్యక్షుడు జీఎం శేఖర్ పేర్కొన్నారు. మంగళవారం జానకీరామయ్య కల్యాణ మండపంలో జిల్లాలోని పుట్టపర్తి, ధర్మవరం, రాప్తాడు నియోజకవర్గాల నాయకులతో ఆయన పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. పొత్తు ఉన్నా లేకున్నా నాయకులు, కార్యకర్తలు ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. 2024 ఎన్నికల్లో కేంద్ర భాజపా అధికారంలోకి రావడం ఖాయమని, రాష్ట్రంలోనూ భాజపా అధికారంలోకి వస్తేనే రాష్ట్రాభివృద్ధి సా§ధ్యమనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. నియోజకవర్గాల వారీగా సమావేశం నిర్వహించి, నాయకులు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. పార్టీ జోనల్, జిల్లా, క్లస్టర్ ఇన్‌ఛార్జులు శివనారాయణ, బాలకృష్ణయాదవ్, ఎల్లారెడ్డి, పార్లమెంటు కన్వీనర్ రమణ, జిల్లా ప్రధాన కార్యదర్శి కత్తి రాజారెడ్డి, నాయకులు హరికృష్ణగౌడ్, అమర్ దేవేందర్, హనుమంతురెడ్డి, సునీల్‌వైట్ల, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.
source : eenadu.net










Discussion about this post