• హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
Tuesday, May 20, 2025
  • Login
  • Register
మన నేత - Mana Netha
Mana Netha App
  • హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
No Result
View All Result
  • హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
No Result
View All Result
మన నేత - Mana Netha
No Result
View All Result
Home రాజకీయం

కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్‌కళ్యాణ్‌

Naresh Kumar by Naresh Kumar
May 10, 2024
in రాజకీయం
Reading Time: 1min read
0
1
SHARES
101
VIEWS
Share on FacebookShare on WhatsApp

రాష్ట్రంలో చాలాకాలంగా డిమాండ్‌ చేస్తున్న కాపు రిజర్వేషన్లతో పాటు ముస్లిం రిజర్వేషన్లు అసలు అవసరమేలేదంటూ జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ఆ రిజర్వేషన్లనే ఆయన వ్యతిరేకిస్తూ పరోక్షంగా పలు వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంగ్లిష్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ముస్లిం రిజర్వేషన్ల అంశంలో ఇటీవల బీజేపీ జాతీయ నేతలు చేస్తున్న ప్రకట­నలకు జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌ పూర్తి మద్దతు ప్రకటించడంతో పాటు కోరుకునే వారందరికీ రిజర్వేషన్లు కల్పించడం సాధ్యమేకాదని తన మనస్సులోని మాటను కుండబద్దలు కొట్టారు.

ఈ రిజర్వేషన్లకు ప్రత్యామ్నాయ మార్గాలు గురించి ఆలోచన చేయాలన్నారు. ఆ ఇంటర్వ్యూలో సంబంధిత మీడియా ఛానల్‌ ప్రతినిధి.. ముస్లింలకు సంబంధించి బీజేపీ వైఖరి గురించి పవన్‌ను ప్రశ్నించినప్పుడు, బీజేపీ ముస్లింలకు వ్యతిరేకం కాదని వ్యాఖ్యానించారు. కానీ, వాళ్లు (బీజేపీ) ముస్లిం రిజర్వేషన్లు అమలుచేయబోమని ఆ పార్టీ నేతలు నేరుగా చెబుతున్నారు కదా.. దానిపై మీరేమీ నిరాశ చెందడంలేదా అన్న ప్రశ్నకు పవన్‌ బదులిస్తూ.. ముస్లిం రిజర్వేషన్లపై బీజేపీ నేతల ప్రకటనలపట్ల తానేమీ నిరాశ, ఆందోళన చెందడంలేదని చెప్పారు. అయినా, రిజర్వేషన్ల అమలుకన్నా యువతకు ఉపాధి అవకాశాలు, నైపుణ్యాలు పెంచేలా వివిధ అంశాల్లో శిక్షణ ఇవ్వాలని సూచించారు.

ఇంకాచదవండి

గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు

May 10, 2024

వేరే పార్టీకి ఓటేస్తే పథకాలు రావంటూ బెదిరింపు

May 10, 2024

రిజర్వేషన్లు కావాలని కోరుకుంటున్న అన్ని వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలన్నా సాధ్యమయ్యే పరిస్థితి కాదని పవన్‌ తేల్చిచెప్పారు. ప్రత్యేకంగా తమ సొంత (కాపు) కులం కూడా రిజర్వేషన్ల కోసం కొన్ని దశాబ్దాలుగా పోరాటం చేస్తోందన్నారు. అందరికీ రిజర్వేషన్లు ఇవ్వాలన్నా కుదరదని.. మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని సుప్రీంకోర్టు స్పష్టంచేసిందని పవన్‌ గుర్తుచేశారు. రిజర్వేషన్లు ఇవ్వడానికి సాధ్యంకానప్పుడు, ప్రత్యామ్నాయ మార్గాల గురించి ఆలోచించాలని ఆయన చెప్పారు.

మరోవైపు.. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం విజయవాడలో పవన్‌ పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ.. రాష్ట్రంలోని యువకుల గళాన్ని అసెంబ్లీలో బలంగా వినిపిస్తానన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేదన్నారు. మైనార్టీల ప్రాథమిక హక్కులకు తాను అండగా ఉంటానని.. కాపులకు రిజర్వేషన్లను అడుగుతున్నారని, న్యాయస్థానాల్లో ఉన్న అంశాలపై తాము మాట్లాడకూడదంటూ ఇంగ్లీష్‌ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూకు భిన్నంగా మాట్లాడారు.

ఇక ఇక్కడ తాను పెంచి పెద్దచేసిన నాయకుడు తనపై విమర్శలు చేస్తూ తిటడం బాధ కలిగిస్తోందని పోతిన మహేష్‌ పేరు ప్రస్తావించకుండా వ్యాఖ్యానించారు. అలాగే, వంగవీటి రాధా చట్టసభలకు వెళ్తానంటే తాను అండగా ఉంటానని పవన్‌ చెప్పారు.

source : sakshi.com

Tags: 2024 electionsjanasena chief pawan kalyan

ఇంకాచదవండి

రాజకీయం

గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు

May 10, 2024
రాజకీయం

వేరే పార్టీకి ఓటేస్తే పథకాలు రావంటూ బెదిరింపు

May 10, 2024
రాజకీయం

ఓటింగ్‌ శాతాన్ని పెంచాలి

May 10, 2024
రాజకీయం

ఓ మహిళా ఏది కావాలో ఎంచుకో.. వరమా? వంచనా?

May 10, 2024
రాజకీయం

ఈసీ ఉత్తర్వులపై ఒకరోజు స్టే

May 10, 2024
రాజకీయం

ఆహా ఏం తెలివి… ఏం తెలివి?

May 10, 2024

Discussion about this post

  • తెదేపాతోనే నిరుద్యోగులకు న్యాయం
  • వేకువనే పోలీసు పంజా
  • గుగూడు
  • వైకాపాను ఇంటికి సాగనంపడమే లక్ష్యం
  • బతికే ఉన్నా..

  • వాలంటీర్లకు వందనమా.. వైకాపా ప్రచారమా
  • కూటమిలో కుతకుత
  • చరవాణిలో గొడవ: తమ్ముడిపై అన్నయ్య దారుణంగా దాడి చేశాడు.
  • పి.సిద్దరాంపురం
  • బ్రాహ్మణపల్లి

మన నేత - Mana Netha

© 2024 మన నేత

  • Privacy Policy
  • Terms and Conditions
  • About Us
  • సంప్రదించండి

No Result
View All Result
  • రాజకీయం
  • క్రైమ్
  • క్రీడలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • టాప్ వీడియోస్
  • సినిమా
  • బిజినెస్

© 2024 మన నేత

Welcome Back!

OR

Login to your account below

Forgotten Password? Sign Up

Create New Account!

OR

Fill the forms below to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In