ఓటు మన భవిష్యత్తును నిర్దేశిస్తుందని ఎస్పీ మాధవరెడ్డి అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఓటు అనేది బలమైన ఆయుధమని, ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకున్నప్పుడే ప్రజాస్వామ్య పరిరక్షణ సాధ్యమవుతుందని అన్నారు. 18 సంవత్సరాలు పైబడిని ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు. స్థానిక పోలీసు పరేడ్ మైదానంలో గురువారం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎస్పీ మాధవరెడ్డి హాజరైనారు . ఓటు హక్కు వినియోగంపై పోలీసు అధికారులు, సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఓటరుగా నమోదు కావడాన్ని గర్వంగా భావించాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ విష్ణు, ఏఆర్ డీఎస్పీ విజయకుమార్ , ఏఓ సుజాత, సీసీ రాఘవేంద్ర, ఆర్ఐలు రాజశేఖరరెడ్డి, టైటాస్ , నారాయణ, సిబ్బంది ఉన్నారు.
source : sakshi.com










Discussion about this post