• హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
Wednesday, May 14, 2025
  • Login
  • Register
మన నేత - Mana Netha
Mana Netha App
  • హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
No Result
View All Result
  • హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
No Result
View All Result
మన నేత - Mana Netha
No Result
View All Result
Home రాజకీయం

ఎన్నికల వేళ ‘జగన్మాయ’!

Naresh Kumar by Naresh Kumar
May 2, 2024
in రాజకీయం
Reading Time: 1min read
0
1
SHARES
100
VIEWS
Share on FacebookShare on WhatsApp

ఎన్నికల వేళ రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు జగన్‌ ప్రభుత్వం దిమ్మదిరిగే షాకిచ్చింది..! బుధవారం ఉదయం నుంచే సెల్‌ఫోన్‌కి వస్తున్న మెసేజ్‌లు చూసి ఉద్యోగులు బెంబేలెత్తిపోయారు. ఇది కలా.. ‘జగన్మాయా’ అని ఆశ్చర్యపోయారు. కాసేపటికి తేరుకుని.. ఇది ఎన్నికల సమయం అన్న విషయం గుర్తుతెచ్చుకుని స్థిమితపడ్డారు. అవును మరి.. జీతం పడిందని మే ఒకటో తేదీనే బ్యాంకుల నుంచి మెసేజ్‌లు వస్తే ఉద్యోగులు బెంబేలెత్తరూ? ప్రతి నెలా ఏ ఐదారు తేదీల్లోనో.. కొన్ని నెలల్లో పన్నెండు, పదమూడో తేదీల్లోనూ జీతాలు తీసుకోవడానికి అలవాటు పడిపోయిన ఉద్యోగులు.. ఒకటో తేదీనే జీతాలు వచ్చేసరికి ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరైపోయారు.! ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న ‘సరెండర్‌ లీవ్‌’ల బకాయిలను ఇటీవలే విడుదల చేయడంతో ఇప్పటికే కొంత షాక్‌లో ఉన్న ఉద్యోగులకు, ఇప్పుడు ఒకటో తేదీనే జీతాలు వేసేయడం మరో బిగ్‌ షాక్‌..! అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ప్రభుత్వ ఉద్యోగుల్ని అనేక రకాలుగా వేధించిన జగన్‌ ప్రభుత్వం… పోలింగ్‌ తేదీ దగ్గర పడేసరికి వారిపై ఎక్కడ లేని ప్రేమ కురిపిస్తోంది. ప్రభుత్వంపై ఉద్యోగులు తీవ్ర ఆగ్రహంతో ఉండటంతో సీఎం జగన్‌ భయపడుతున్నట్లు కనిపిస్తోంది. వారిని బుజ్జగించడానికే సరెండర్‌ లీవ్‌ల బకాయిలు చెల్లించడం, ఒకటో తేదీనే జీతాలివ్వడం లాంటి తాయిలాలతో ఎరవేస్తున్నారన్న అభిప్రాయం ఉద్యోగవర్గాల నుంచి వినిపిస్తోంది. బుధవారం కార్మిక దినోత్సవం సందర్భంగా బ్యాంకులకు సెలవు అయినా.. ఉద్యోగులకు జీతాలు చెల్లించడం విశేషం!

గతంలో ఉద్యోగులు తమకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాల కోసం ఉద్యమాలు, డిమాండ్లు చేసేవారు. కానీ జగన్‌ ప్రభుత్వంలో ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులు పీఆర్సీ అమలు, సీపీఎస్‌ రద్దు వంటి సీరియస్‌ అంశాలతో పాటు… ప్రతి నెలా జీతాల కోసం కూడా పోరాడాల్సి వచ్చేది. అంతకుముందు రెండు మూడు దశాబ్దాల్లో ఎప్పుడూ చూడని విచిత్రమైన పరిస్థితుల్ని జగన్‌ ప్రభుత్వంలో ఉద్యోగులు చూశారు. అంతకుముందు ప్రతి నెలా ఒకటో తేదీనే పక్కాగా జీతాలు తీసుకోవడానికి అలవాటుపడ్డ ప్రభుత్వ ఉద్యోగులు… వారు కట్టాల్సిన వాయిదాలు, ఖర్చులనూ దానికి తగ్గట్టుగా ప్లాన్‌ చేసుకున్నారు. జగన్‌ ప్రభుత్వంలో జీతం ఎప్పుడు వస్తుందో తెలియని అనిశ్చిత పరిస్థితుల వల్ల తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సకాలంలో జీతం ఇవ్వాలని ఉద్యోగులు, పింఛనుదారులు రోడ్డెక్కి పోరాడాల్సిన దుస్థితిని ప్రభుత్వం కల్పించింది. ఒక దశలో రాష్ట్రప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ తదితరులు అప్పటి గవర్నర్‌ను కలిసి… ఉద్యోగులకు సమయానికి జీతభత్యాలు ఇచ్చేలా చట్టం చేయాలని కోరారంటేనే ప్రభుత్వం వారిని ఏ స్థాయిలో వేధించిందో అర్థమవుతుంది. ప్రతి నెలా ప్రభుత్వానికి వేగంగా అప్పు పుట్టాలని ఉద్యోగులు దేవుడికి దండం పెట్టుకునేవారంటే అతిశయోక్తి కాదు! అప్పు దొరికితేనే తమకు జీతాలిస్తుందన్న నమ్మకం వారిలో స్థిరపడిపోయింది. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు రాకపోవడం సామాజిక మాధ్యమాల్లో ప్రధాన చర్చనీయాంశాల్లో ఒకటిగా ఉండేది.

ఇంకాచదవండి

కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్‌కళ్యాణ్‌

May 10, 2024

గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు

May 10, 2024

ఐదేళ్లుగా సీఎం జగన్‌, మంత్రులు, ప్రభుత్వ పెద్దలు… ఉద్యోగుల్ని పూచికపుల్లలా తీసిపారేశారు. వారి సమస్యలు, డిమాండ్లు పట్టవన్నట్లు వ్యవహరించారు. వారి న్యాయబద్ధమైన డిమాండ్లనూ ఎగతాళి చేశారు. ‘‘ప్రభుత్వ ఉద్యోగులకు కాళ్లు పట్టుకునే నేర్పూ ఉండాలి’’ అని ఒక సీనియర్‌ మంత్రి వ్యాఖ్యానించారు. ‘‘నిధుల్ని ప్రజలకు పంచాలా… లేక ఉద్యోగులకు ఇవ్వాలా?’’ అంటూ… మీరు అంత ప్రాధాన్యం కాదన్నట్లు మరో మంత్రి తేలిక చేసి మాట్లాడారు. వైకాపా ఐదేళ్ల పాలనలో ఉద్యోగులకు నిత్యం ఇలాంటి అవమానాలెన్నో ఎదురయ్యాయి. బకాయిల గురించి ఎంతగా పోరాడుతున్నా కనీసం పట్టించుకోని ప్రభుత్వం… నాలుగైదు రోజుల క్రితం హఠాత్తుగా కొన్ని విభాగాల ఉద్యోగులకు సరెండర్‌ లీవ్‌ల బకాయిల్ని చెల్లించింది. ఒక్కొక్కరి ఖాతాలో రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు వేసింది. ఇప్పుడు ఒకటో తేదీనే జీతం వేసేసింది. బుధవారం ఉదయం 8.30 నుంచే ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు పడటం మొదలైనట్టు సమాచారం. సాంఘిక సంక్షేమశాఖ ఉద్యోగులు తమకు మధ్యాహ్నం వరకు జీతం పడలేదని ఆర్థికశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్తే, వారికీ హుటాహుటిన వేసేసినట్లు తెలిసింది. ఉద్యోగులకు జగన్‌ ప్రభుత్వం ఇంకా పీఆర్సీ, డీఏ, టీఏ, మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ బిల్లులు, సీపీఎస్‌ ఉద్యోగులకు ప్రాన్‌ ఖాతాలకు జమచేయాల్సిన బకాయిలు కలిపి… రూ.17 వేల కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉంది. అది తమవల్ల కాదని చేతులెత్తేసిన ప్రభుత్వం… ఈ నెలలోనైనా జీతాలు ఒకటో తేదీన ఇచ్చి ఉద్యోగుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.

source : eenadu.net

Tags: 2024 election campaigningAP CM YS jagan

ఇంకాచదవండి

రాజకీయం

కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్‌కళ్యాణ్‌

May 10, 2024
రాజకీయం

గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు

May 10, 2024
రాజకీయం

వేరే పార్టీకి ఓటేస్తే పథకాలు రావంటూ బెదిరింపు

May 10, 2024
రాజకీయం

ఓటింగ్‌ శాతాన్ని పెంచాలి

May 10, 2024
రాజకీయం

ఓ మహిళా ఏది కావాలో ఎంచుకో.. వరమా? వంచనా?

May 10, 2024
రాజకీయం

ఈసీ ఉత్తర్వులపై ఒకరోజు స్టే

May 10, 2024
Next Post

తెదేపా అధికారంలో ఉంటేనే మహిళలకు రక్షణ

Discussion about this post

  • పాల్ అనుచరులు చేపట్టిన ప్రయాణం
  • పేదల ప్రాణాలతో చెలగాటమాడొద్దు
  • తప్పుడు పత్రాలు సృష్టించి భూమిని కాజేస్తున్న భూకబ్జాదారులు
  • వేపరాల
  • పార్థసారథికి పచ్చ పోటు!

  • మత్స్యకారుల ఆర్థిక ప్రగతికి ప్రాధాన్యత
  • ధర్మవరంలో హింస..
  • నర్సింపల్లి
  • 17న పల్నాడులో మోడీ టూర్..!
  • రొద్దం

మన నేత - Mana Netha

© 2024 మన నేత

  • Privacy Policy
  • Terms and Conditions
  • About Us
  • సంప్రదించండి

No Result
View All Result
  • రాజకీయం
  • క్రైమ్
  • క్రీడలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • టాప్ వీడియోస్
  • సినిమా
  • బిజినెస్

© 2024 మన నేత

Welcome Back!

OR

Login to your account below

Forgotten Password? Sign Up

Create New Account!

OR

Fill the forms below to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In