జిల్లాలో సోమవారం 37 సెట్ల నామపత్రాలు దాఖలయ్యాయి. ఇందులో అనంత లోక్‌సభకు 7 ఎనిమిది, అసెంబ్లీ స్థానాలకు 30 సెట్ల ప్రకారం నామినేషన్లు వచ్చాయి. లోక్‌సభ స్థానానికి నామినేషన్ వేసిన వారిలో.. తెదేపా అభ్యర్థిగా జి.లక్ష్మీనారాయణ (అంబిక), వైకాపా అభ్యర్థులుగా శంకరనారాయణ తరఫున రెండు సెట్లు, మాలగుండ్ల రవీంద్ర నామపత్రాలు దాఖలు చేశారు. 8 అసెంబ్లీ స్థానాలకు 28 మంది అభ్యర్థులు సంబంధిత ఆర్‌ఓలకు 30 సెట్లను దాఖలు చేశారు. రాయదుర్గానికి తెదేపా అభ్యర్థిగా కాలవ శ్రీనివాసులు, వైకాపా తరఫున మెట్టు గోవిందరెడ్డి, కళ్యాణదుర్గానికి తెదేపా అభ్యర్థులుగా అమిలినేని సురేంద్రబాబు, అమిలినేని రమాదేవి, ఉరవకొండకు వైకాపా అభ్యర్థిగా వై.విశ్వేశ్వర్‌రెడ్డి, గుంతకల్లుకు తెదేపా అభ్యర్థిగా గుమ్మనూరు జయరాం, వైకాపా తరఫున వై.శారద, కాంగ్రెస్ నుంచి ప్రభాకర్, తాడిపత్రికి కాంగ్రెస్ నుంచి గుజ్జల నాగిరెడ్డి, వైకాపా అభ్యర్థులుగా కేతిరెడ్డి పెద్దారెడ్డి, కేతిరెడ్డి రమాదేవి, శింగనమలకు వైకాపా తరఫున మన్నపాకుల చిన్నపెద్దన్న, అనంత అర్బన్‌కు సీపీఐ అభ్యర్థిగా సి.జాఫర్, వైకాపా తరపున అనంత వెంకటరామిరెడ్డి రెండు సెట్లు నామినేషన్ వేశారు.
source : eenadu.net










Discussion about this post