కనిగిరి నుంచి వైఎస్సార్‌సీపీ తరఫున టికెట్ దక్కించుకున్న దద్దాల నారాయణ యాదవ్ విద్యార్థి దశ నుంచే వైఎస్సార్ అభిమాని. 2014, 2019 ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించారు. 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో హనుమంతునిపాడు జెడ్పీటీసీగా పోటీ చేసి 8.900 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2007 నుంచి సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేస్తున్నారు. దద్దాల చారిటబుల్ ట్రస్టును స్థాపించి అభాగ్యులకు అండగా నిలిచి ఎంతో మందికి ఆర్థిక సాయం చేశారు.
మడకశిర అభ్యర్థిగా ఎంపిక చేసిన ఈర లక్కప్ప (మాదిగ) ఉపాధి కూలీ. రెండు గదుల పక్కా గృహంలో ఉంటున్న అతనిని పిలిచి మరీ టికెట్ ఇవ్వడం విశేషం.శింగనమల అభ్యర్థిగా ప్రకటించిన వీరాంజనేయులు కూడా సాధారణ దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందినవారే. టిప్పర్ డ్రైవర్‌గా ఉన్న ఈయనకు ఆస్తులేమీ లేవు. మైలవరం స్థానానికి ఎంపిక చేసిన సర్నాల తిరుపతిరావు సామాన్య రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి. పదో తరగతి వరకు చదవుకున్నారు. తండ్రి సర్నాల చిన్న జమలయ్య సహకార బ్యాంకులో అటెండర్‌గా పని చేస్తున్నారు. రాజకీయాలపై ఆసక్తితో 2014 నుంచి 2019 వరకు వైఎస్సార్‌సీపీ మైలవరం మండల సెక్రటరీగా పని చేశారు. 2021లో మైలవరం జెడ్పీటీసీ అభ్యర్థిగా బరిలోకి దిగి 16 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
source : sakshi.com










Discussion about this post