బొమ్మనహాళ్ ఎంపీడీవో కార్యాలయంలో శనివారం జరిగిన ఆసరా చెక్కు పంపిణీ సభ రసాభాసగా మారింది. రాయదుర్గం ఎమ్మెల్యే (అసమ్మతి), ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, వైకాపా తాజా సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవిందరెడ్డి ఒకరిపై మరోకరు విమర్శలు చేసుకొని వాగ్వాదం పడ్డారు. ఇరు వర్గీయులు వాదోపవాదనలకు దిగడంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సభలో కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ టికెట్ ఇచ్చినంత మాత్రాన ఎమ్మెల్యేగా గెలిచినట్లేనా అని పరోక్షంగా మెట్టుపై విమర్శలకు దిగారు. వెంటనే మెట్టు గోవిందరెడ్డి మాట్లాడుతూ కాపు తాటాకు చప్పళ్లకు తాను భయపడని విమర్శలు చేశారు. చివరకు పోలీసులు, అధికారులు జోక్యం చేసుకుని మహిళలకు మెగా చెక్కును పంపిణీ చేయించారు.
source : eenadu.net
 
	    	 
                                









 
                                    
Discussion about this post