• హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
Wednesday, May 14, 2025
  • Login
  • Register
మన నేత - Mana Netha
Mana Netha App
  • హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
No Result
View All Result
  • హోమ్
  • నేత
  • జిల్లాలు
  • నియోజకవర్గాలు
  • మండలాలు
  • గ్రామ పంచాయతీలు
  • న్యూస్
    • రాజకీయం
    • క్రైమ్
    • జాతీయం
    • టాప్ స్టోరీస్
    • క్రీడలు
    • అంతర్జాతీయం
    • టాప్ వీడియోస్
    • జనరల్
    • బిజినెస్
    • భక్తి
No Result
View All Result
మన నేత - Mana Netha
No Result
View All Result
Home రాజకీయం

అన్నింటా ‘అతి’బాబు

Naresh Kumar by Naresh Kumar
March 18, 2024
in రాజకీయం
Reading Time: 1min read
0
1
SHARES
100
VIEWS
Share on FacebookShare on WhatsApp

ఐదేళ్ల క్రితం

మోదీ వల్ల దేశం సర్వ నాశనమైపోయింది. మోదీ ఒక టెర్రరిస్టు. ఆయనకు భార్య లేదు. తల్లిపై గౌరవం లేదు. మోదీ వల్ల దేశంలో ఎవరికీ ఉపయోగం లేదు.

ఇంకాచదవండి

కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్‌కళ్యాణ్‌

May 10, 2024

గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు

May 10, 2024

ఆదివారం

మోదీ భారతదేశాన్ని విశ్వగురువుగా మారుస్తున్న ఒక శక్తి. మోదీ అంటే అభివృద్ధి. మోదీ అంటే సంస్కరణ. మోదీ అంటే భవిష్యత్తు.

ఈ మాటలు మాట్లాడిన నాలుక ఒక్కటే. మడ­­త­పడిందంతే.. ఇంతలా మడతపడే నాలుక ఉన్నది చంద్రబాబు ఒక్కరికే అని ఆదివారం జరి­గిన బొప్పూడి సభలో మరోసారి నిరూపితమైంది. ఆ నాడు మోదీని నోటికొచ్చినట్లు తిట్టిన చంద్రబాబు.. నేడు తన అవసరార్థం అదే నోటితో మోదీని ఇంద్రుడు, చంద్రుడు.. అంటూ పొగడ్తల్లో ముంచెత్తారు. మోదీజీ అని పిలిస్తే సరిపోయేదానికి మోదీజీ గారూ.. అంటూ గారూ అన్న పదాన్ని అదనంగా చేర్చి చంద్రబాబు ప్రదర్శించిన అతి వినయం, ఆయన్ని పొగిడేందుకు పడిన తాపత్రయాన్ని చూసి ప్రజలతోపాటు టీడీపీ శ్రేణులు కూడా ముక్కున వేలేసుకున్నారు.

మోదీ ప్రపంచం మెచ్చిన మేలైన నాయకుడంటూ పొగుడుతూ సాగిలపడిపోవడం చూసి చంద్రబాబుకు ఆస్కార్‌ అవార్డు ఇవ్వొచ్చనే సెటైర్లు సోషల్‌ మీడియాలో పేలుతున్నాయి. నోట్ల రద్దు, జీఎస్‌టీ వల్ల ఉపయోగం లేదని గతంలో దుమ్మెత్తి పోసిన విషయాన్ని జనం మరచిపోయారనుకుని, ఇప్పుడు ఆ రెండింటి వల్ల దేశ ఆర్థిక ముఖ చిత్రం మారిపోయిందని, మార్చిన వ్యక్తి మోదీ అంటూ మాట మార్చేశారు. తాను ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారనే రీతిలో చంద్రబాబు మాట్లాడారు.

మధ్యలో బీజేపీ సబ్‌ కా సాథ్, సబ్‌ కా వికాస్‌ నినాదాన్ని హిందీలో చెప్పి మోదీని ఆకర్షించేందుకు ప్రయత్నించారు. ఇంత వంగిపోయి మరీ ప్రధానిని పొగడటం వెనుక కారణం చంద్రబాబును వెంటాడుతున్న కేసులే. తనపై ఉన్న కేసులను ఎక్కడ తిరగదోడతారో, ఎక్కడ జైల్లో పెడతారో, ఎక్కడ తన అవినీతి చరిత్రను పెకలిస్తారో అనే భయంతోనే మోదీ కరుణ కోసం చంద్రబాబు పాకులాడారు.

ఎంత భజన చేసినా ప్రధాని మోదీ మాత్రం చంద్రబాబును పెద్దగా పట్టించుకోలేదు. పక్కనే కూర్చున్నా మొక్కుబడి మాటలు తప్ప చిరునవ్వుతో అప్యాయంగా మాట్లాడేందుకు ఆయన ఇష్టపడలేదు. పిలుపులోనూ గతంలో ఇచ్చిన గౌర­వాన్ని ప్రధాని మోదీ ఇప్పుడు చంద్రబాబుకు ఇవ్వ­లేదు. చంద్రబాబునాయుడు జీ అంటూ గతంలో మోదీ ఆయన్ని సభల్లో సంబోధించేవారు.

source : sakshi.com

Tags: 2024 election campaigningchandrababu nadiunarendra modiprajagalam sabha

ఇంకాచదవండి

రాజకీయం

కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్‌కళ్యాణ్‌

May 10, 2024
రాజకీయం

గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు

May 10, 2024
రాజకీయం

వేరే పార్టీకి ఓటేస్తే పథకాలు రావంటూ బెదిరింపు

May 10, 2024
రాజకీయం

ఓటింగ్‌ శాతాన్ని పెంచాలి

May 10, 2024
రాజకీయం

ఓ మహిళా ఏది కావాలో ఎంచుకో.. వరమా? వంచనా?

May 10, 2024
రాజకీయం

ఈసీ ఉత్తర్వులపై ఒకరోజు స్టే

May 10, 2024
Next Post

జనసేన త్వరలో క్లోజ్ అవుతుంది – ముద్రగడ

Discussion about this post

  • పాల్ అనుచరులు చేపట్టిన ప్రయాణం
  • పేదల ప్రాణాలతో చెలగాటమాడొద్దు
  • తప్పుడు పత్రాలు సృష్టించి భూమిని కాజేస్తున్న భూకబ్జాదారులు
  • వేపరాల
  • పార్థసారథికి పచ్చ పోటు!

  • మత్స్యకారుల ఆర్థిక ప్రగతికి ప్రాధాన్యత
  • ధర్మవరంలో హింస..
  • నర్సింపల్లి
  • 17న పల్నాడులో మోడీ టూర్..!
  • రొద్దం

మన నేత - Mana Netha

© 2024 మన నేత

  • Privacy Policy
  • Terms and Conditions
  • About Us
  • సంప్రదించండి

No Result
View All Result
  • రాజకీయం
  • క్రైమ్
  • క్రీడలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • టాప్ వీడియోస్
  • సినిమా
  • బిజినెస్

© 2024 మన నేత

Welcome Back!

OR

Login to your account below

Forgotten Password? Sign Up

Create New Account!

OR

Fill the forms below to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In